Home  »  TV News  »  Brahmamudi : ఇందుని కాపాడేందుకు నందు ప్లాన్.. చిక్కుల్లో పడ్డ భ్రమరాంబ అండ్ కో!

Updated : Apr 21, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1011 లో.. చక్రిని రేఖ కోటి రూపాయలు అడుగుతుంది. మీ దగ్గరున్న నగలు మొత్తం నాకు ఇవ్వండి దాన్ని బట్టి ఇస్తానని చక్రి అంటాడు. దాంతో అందరు ఇంట్లో ఉన్న నగలు తీసుకొని రావడానికి సిద్ధం అవుతారు. మరొకవైపు రాజు, లక్కీ పడుకుంటారు. అప్పుడే నందు వాళ్ళకి కన్పించకుండా ఇందు దగ్గరికి వస్తుంది. ఇందుని చూసి అక్క ఏంటి అక్క.. ఇదంతా నువ్వు కిడ్నాప్ చేసుకున్నావని  తెలిసింది. తర్వాత మళ్ళీ ఎవరో కిడ్నాప్ చేశారు అన్నారని నందు అనగానే ఇందు జరిగింది చెప్తుంది.

పదా అక్కా వెళదామని నందు అంటుంది. ఇప్పుడు రాలేను.. నేను అనుకున్నది జరిగే వరకు ఇక్కడే ఉంటానని ఇందు అంటుంది. నా టెన్షన్ అంతా నానమ్మ తాతయ్య గురించే అని ఇందు అంటుంది. నువ్వు వాళ్ళ గురించి టెన్షన్ పడకు అక్క.. అంతా నేను చూసుకుంటానని నందు అంటుంది. నేను ఏమవుతానని ఇదంతా చేస్తున్నావని ఇందు అడుగుతుంది. నువ్వే కదా అక్క దేవుడు ఇచ్చిన చెల్లి అన్నావ్ అందుకేనని నందు చెప్తుంది. మరొక వైపు అందరి నగలు తీసుకొని వస్తారు. అన్నిటి విలువ యాభై లక్షలు అవుతుంది. ఇంకా తీసుకొని రండి అని చక్రి అంటాడు. దాంతో రేఖ, భ్రమరాంబ కలిసి అపర్ణ దగ్గరికి వెళ్తారు. తన దగ్గరున్న బంగారు గాజలు ఇవ్వమని అడుగుతారు. ఇవ్వను ఇవి మా అత్తయ్య ఇచ్చింది.. ఇవి నా మనవరాలు ఇందు కోసమని అపర్ణ అంటుంది. దాంతో భ్రమరాంబ బలవంతంగా లాక్కుంటుంది. అప్పుడే నందు వచ్చి ఏం చేస్తున్నారు.. ఇలా బెహేవ్ చేస్తున్నారు ఏంటి.. నాకు మీపై డౌట్ వస్తుందని నందు అనగానే భ్రమరాంబ టెన్షన్ పడుతుంది.

ఆ తర్వాత చక్రి యాభై లక్షలు ఇచ్చి నగలు తీసుకొని నా అప్పు మొత్తం వారం రోజుల లోగా ఇచ్చేయాలని వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు మిగతా యాభై లక్షలు ఎలా అని రేఖ టెన్షన్ పడుతుంది. ఇందాక గమనించాను.. ఆ తాతయ్యకి మీరు ఎందుకు ఆపరేషన్ చేయించలేదు.. అంత డబ్బులు ఉంటాయి కదా అని నందు అనగానే రేఖ, భ్రమరాంబ టెన్షన్ పడుతారు. చేయిస్తామని భ్రమరాంబ అంటుంది. మరొకవైపు నాకు టీ కావాలని రాజుతో ఇందు అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.